రాయికల్
సేవాలాల్ చూపిన మార్గంలో నడుచుకోవాలి

viswatelangana.com
February 16th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం దావనపల్లి గ్రామంలో సంస్థ శ్రీ సేవాలాల్ 286వ జయంతి సందర్భంగా ఆదివారం భోగ్ బండారు కార్యక్రమం నిర్వహించారు. సంఘ అధ్యకులు శ్రీ సురేందేర్ నాయక్ మాట్లాడుతూ శ్రీ సన్త్ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఐదవ ధర్మ గురువని, బంజారా సంస్కృతి వేషధారణ జీవన విధానాలతో పాటు యావత్ బంజారా జాతిని ఎకాదటికి తీసుకువచ్చిన మహనీయులని అన్నారు. సేవాలాల్ చూపిన మార్గంలో నడుచుకోవాలని గ్రామ పెద్ద పూజారి బానోత్ హంజారియా, కిషన్ నాయక్ ఉప సర్పంచ్ భిక్యా నాయక్ పేర్కొన్నారు, గ్రామ సేవాలాల్ ట్రస్ట్ సభ్యులు బాణావత్ తిరుపతి నాయక్ హపావత్ గంగాధర్, రాజు, అంబాజీ, తిరుమల్ బలరాం మాజీ సర్పంచ్ మల్లయ్య, వెంకటేష్, దేవేందర్, తిరుపతి, కొమురయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



