కథలాపూర్
ఊట్ పల్లి లో ఘనంగా దుర్గమ్మ బోనాలు

viswatelangana.com
May 31st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని ఊట్ పల్లి గ్రామంలో ఘనంగా దుర్గమ్మ బోనాల ఉత్సవం నిర్వహించారు. గ్రామంలో పోతరాజుల విన్యాసాలు,నృత్యాలతో యువకుల డ్యాన్స్ తో కేరింతలతో డిజె సౌండ్స్ తో గ్రామస్తులు బోనాలు మహిళలు ఊరేగింపుగా బోనాలను తీసుకువచ్చి, అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు అమ్మవారికి ఒడిబియ్యం, నైవేద్యాలను సమర్పించి సకాలంలో వర్షాలు కురిసి రైతులు, ప్రజలు పడి పంటలతో, సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



