1973-1975 ఇంటర్ పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సంబరాలు

viswatelangana.com
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1973 -1975 సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు 2025 సంవత్సరము నాటికి విజయవంతంగా 50 సంవత్సరాలు పూర్తి అయిన స్వర్ణోత్సవ వేల పూర్వ విద్యార్థి మిత్రులు ఆత్మీయ అపురూప స్వర్ణోత్సవాల వేడుక నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పూర్వ విద్యార్థులందరూ కూడా ఒక చోట కలుసుకొని తమ యొక్క జీవిత అనుభూతుల్ని, మధుర జ్ఞాపకాలను, పంచుకోవడం జరిగింది. దాదాపు 200 మంది తమ కుటుంబాలతో పాల్గొనడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆటపాటలతో, మధురస్మృతులతో, చిన్ననాటి జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకొని ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. మామూలు స్థాయి మొదలుకొని ఉన్నత స్థాయికి చేరుకున్న విద్యార్థులు అందరూ తమతమ అనుభూతుల్ని, జీవితంలో ఎదగడానికి ఎదుర్కొన్న కష్టాలను ఒకరికొకరు పంచుకొని జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఈ సమ్మేళనంలో తులసి కృష్ణమూర్తి, మేడి కిషన్, చిలమంతుల ఛత్రపతి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, బర్ల సాయన్న, వనతడుపుల మురళి, ఉయ్యాల నరసయ్య, చెన్న విశ్వనాథం, పుప్పాల ప్రభాకర్, అశోక్, వనపర్తి లింగయ్య, నరేందర్ రెడ్డి నిజామాబాద్, సురేష్, బొడ్ల ఆంజనేయులు, ఎంఎస్ మూర్తి, నీలకంఠం, సామిల్ నాయక్, యు.అశోక్, వి నర్సయ్య, శ్రీనివాసమూర్తి తదితర మిత్రుల బృందము పాల్గొనడం జరిగింది.



