రాయికల్
ఒపెన్ టెన్త్ ఇంటర్ అడ్మీషన్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం…
టి.వై.ఎం.ఎస్.ఈ.యు రాష్ట్ర శాఖ...

viswatelangana.com
June 6th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
తెలంగాణ ఒపెన్ స్కూల్ సొసైటీ 2025-2026 విద్య సంవత్సరము అడ్మీషన్స్ కై ఆర్.సి.నంబర్: 459/బి1/టాస్/2025 తేది:05/06/2025 గల ఉత్తర్వులను తెలంగాణ ఒపెన్ స్కూల్ డైరెక్టర్ జారీ చేసినట్లు తెలంగాణ యాదవ మహాసభ ఉద్యోగుల రాష్ట్ర శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్మిషన్ గడువు ప్రక్రియ ఈ జూన్ -12 నుండి ఆగష్టు -12 వరకు కలదని ఒపెన్ టెన్త్ ఇంటర్ లో అడ్మీషన్ పొందగోరే అభ్యర్థులు మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్ లైన్ లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని అట్టి దరఖాస్తు లను సంబంధిత స్టడీ సెంటర్ల లో సబ్ మిట్ చేయాలని, ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



