విద్యార్థుల చదువులో తల్లిదండ్రుల పాత్ర కీలకం

viswatelangana.com
విద్యార్థులు చదువులో రాణించాలంటే తల్లిదండ్రుల పాత్ర కీలకమని గ్రీన్వుడ్ హై స్కూల్ కరస్పాండెంట్ మిట్టపెల్లి మహేష్ రెడ్డి అన్నారు. సోమవారం రాయికల్ పట్టణ కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్ లో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కీలకమని అన్నారు. రోజులో కొంత సమయాన్ని తమ పిల్లలకు కేటాయించాలని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే తల్లిదండ్రులు తమ వంతు పాత్ర పోషించాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పిల్లల పట్ల అనుకూల వైఖరి ప్రదర్శిస్తూ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచాలని, ప్రతి దినం ఒక గంట పిల్లలతో మాట్లాడుతూ వారు చేసే పనులను గమనిస్తూ వారి అభిరుచికి అనుగుణంగా తల్లిదండ్రులు పిల్లలను సన్నద్ధం చేయాలని, దాని కనుగుణంగా కృషి చేయాలని తల్లిదండ్రులను కోరారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



