రాయికల్

క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం

viswatelangana.com

April 19th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో సమగ్ర శిక్షా మరియు రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ లో భాగంగా రాయికల్ బాలుర ఉన్నత పాఠశాలలో మండల విద్యా కేంద్రం ఆధ్వర్యంలో శనివారం క్విజ్ పోటీలు నిర్వహించారు. మండలంలోని ప్రాథమిక పాఠశాలల 3,4,5వ తరగతులకు, ఉన్నత పాఠశాలల 8,9వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీలలో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ విజేతలకు పీఆర్ టీయూ టిఎస్ ఆధ్వర్యంలో డిక్షనరీలను బహుమతులుగా అందజేశారు. జిల్లా స్థాయి క్విజ్ పోటీలకు ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేసినట్లు ఎంఆర్సి సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రమేష్, టిఆర్టిఎఫ్ రాష్ట్ర నాయకుడు బొల్లె చిన్నయ్య, పిఆర్టియు మండల అధ్యక్షులు అంతడుపుల గంగారాజం, ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య, అసోసియేట్ అధ్యక్షుడు కడకుంట్ల అభయ్ రాజ్, కార్యదర్శులు బాపురావు, నరేష్, ఉషకోల రాము, రిషి,తరంగిని, రజిత, పద్మ, ఉమారాణి, వెంకటేశ్వర్ రావు, వేల్పుల గంగారాజం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button