కోరుట్ల
సేవా పురస్కార్ అవార్డు ప్రధానం
viswatelangana.com
February 17th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణానికి చెందిన ఎండి మోబిన్ అత్యుత్తమ సేవ రత్న అవార్డు అందుకున్నారు. వెంకట్రావుపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో శనివారం జీడ్స్ సేవా పురస్కార్ అవార్డ్- 2024 నిర్వహించారు రక్తదానంలో కొన్ని నెలల క్రితం భారీ వర్షాలకు ముంపుకు గురైన కాలనీలో స్థానిక ప్రజలకు అండగా ఉంటూ రోజుల పాటు సహాయక చర్యలను సేవలను గుర్తించి ఉత్తమ సేవలు అందించినందుకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీ నరసింహారావు జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు అంగడి ఆనంద్ లు మోబిన్ ను శాలువతో సత్కరించి జ్ఞాపిక అవార్డు అందజేశారు.



