కోరుట్ల
గుండెపోటుతో మృతిచెందిన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్

viswatelangana.com
June 12th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్లకు చెందిన జల హరీష్ అనే యువకుడు గుండెపోటుతో అకస్మాత్తుగా మృతిచెందిన ఘటన బుధవారం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో జల హరీష్ కుటుంబాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మానసికంగా అండగా నిలిచారు. ఎమ్మెల్యే వారి కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలను అందజేయడానికి పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటామని తెలిపారు.



