కథలాపూర్
ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎస్సై నవీన్ కుమార్

viswatelangana.com
March 7th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని గల ప్రజలు అప్రమత్తంగాఉండాలని అపరిచిత వ్యక్తుల నుండి వచ్చిన ఫోన్ కాల్స్ కు సమాధానం ఇవ్వవద్దని ఎట్టి పరిస్థితులలో గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గాని ఏటీఎం పిన్ నెంబర్ మరియు ఏ ఇతర సెక్యూరిటీ సంబంధిత సమాచారాన్ని అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దని సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వం పెట్టిన స్కీములు కానీ మీ యొక్క లోన్స్ కోసం కానీ అపరిచితులు వ్యక్తులు ఫోన్ ధ్వారా మీ యొక్క ఫోన్ కి ఓటీపీ వస్తాది అని చెప్పడం కానీ మీ యొక్క డిటేల్స్ చెప్పకూడదు మీకు ఏదో తేడాగా అనిపించినప్పుడు వెంటన్నే 100 కు డైల్ చేసి లేదా ఎస్సై జి నవీన్ కుమార్ కు వివరాలు తెలుపాలని కోరారు



