బైక్ ర్యాలీతో వేల మంది కార్యకర్తలతో మోడీ సభకు తరలిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్

viswatelangana.com
మోడీ సభకు కోరుట్ల పట్టణం నుండి సుమారు 500 పైబడి ద్విచక్ర వాహనాలతో మోడీ సభకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ జగిత్యాల కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో ఉన్న ఏ భాజపా కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటున్నానని, ఉంటానని అధిష్టానం నిర్ణయించిన వారికి మద్దతుగా నిలబడి వారిని గెలిపించేందుకు సాయి శక్తుల కృషి చేస్తున్నానని చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కొంతమంది పని కట్టుకొని అసత్య ప్రచారాలు చేయడం సరికాదని అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కార్యకర్తలు సైనికుడి వలె పనిచేసి మోడీ కి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని, ఆయన భారతీయుల కోసం చేయవలసిన అనేక ముఖ్యమైన పనులు ఇంకా మిగిలి ఉన్నాయని భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.



