భీమారం మండల కేంద్రంలో చుట్టుపక్కల గ్రామస్తులతో ఆత్మీయ కలయిక. ప్రజా సమస్యలపై చర్చ…

viswatelangana.com
భీమారం మండల కేంద్రంలో ప్రజా సమస్యలపై వేములవాడ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ చర్చించారు. మండల పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులతో సమస్యలు, అభివృద్ధి పనులపై, వాటికి సంభయందించిన విధివిధానాలపై చర్చించారు.భీమారంలో నూతన కరెంట్ సుబుస్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పల్లె దవాఖాన, మోత్కూరావుపేట-చందుర్తి రోడ్డు, ఎస్ డి ఎఫ్ నిధుల పనితీరు, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి, కలిగోట సురమ్మ కుడి, ఎడమ కాలువల కార్యాచరణ, తాగునీటి, సాగునీటి, వరద కాలువలో నీటి నిల్వ, భీమారం మండల అభివృద్ధి, సంబంధిత కార్యాలయాల నిర్మాణం, అధికారుల జీతాలు, ఇలా మండలానికి అనుబంధ విషయాలపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ – గ్రామస్తులు చర్చించారు. మేడిపల్లి, భీమారం మండలాల సమస్యలపై తనకు అవగాహన ఉందని, వాటికి అనుగుణంగా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమ అనంతరం పలు సంఘాల పెద్దమనుసులు ఎమ్మెల్యే కు సన్మానం చేశారు,



