రాయికల్

గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం

viswatelangana.com

April 23rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామంలో గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్ కోచింగ్ సెంటర్ చైర్మన్ కాశివేణి రాజేందర్ ను సన్మానించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో ఇప్పటివరకు రాయికల్ మండలం చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు విజ్ఞాన్ కోచింగ్ సెంటర్ ద్వారా నిరుపేద విద్యార్థులకు 280 మంది విద్యార్థులకు సీట్లు వచ్చాయని అన్నారు విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని రానున్న రోజుల్లో ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ కోచింగ్ సెంటర్ చైర్మన్ కాశ వేణి రాజేందర్ మాజీ సర్పంచ్ ముద్దసాని రాజమౌళి మారరాజిరెడ్డి న్యాయవాది మదం మల్లేష్ బట్టు రంజిత్ ముద్దసాని రాజు ఆంజనేయులు వినోద్ అంజి అనీల్ మహేష్ అంజి నితిన్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button