రాయికల్
మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

viswatelangana.com
April 30th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలలో టీఎస్ మోడల్ స్కూల్ ఇటిక్యాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగురవేశారు. రేగటి సాయి రిషిత్ 10/10 జిపిఏ సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచారు. మరియు సిహెచ్.స్ఫూర్తి 9.8 జిపిఏ మరియు పి. సాత్విక, ఏ.ఆదిత్య 9.7 జిపిఏ లు సాధించినారు. మరియు 9.0 జిపిఏ మరియు ఆపై సాధించిన విద్యార్థులు 20 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 88 విద్యార్థులలో 82 విద్యార్థులు పాసయ్యారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ శ్రీధర్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించారు.



