రాయికల్

భూపతిపూర్ కచేరి కాడి బృందం వారి ఆర్థిక సహాయం

viswatelangana.com

May 19th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలము కొత్తపేట గ్రామానికి చెందిన మ్యాడారపు అనిల్ కుమార్(22)అనే యువకుడు కడెం వెళ్లి వస్తుండగా ప్రమాద వశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. అనిల్ కి భార్య 7 నెలల కూతురు ఉన్నారు. వీరి కుటుంబం అనిల్ సంపాదన మీద ఆధారపడి జీవించేవారు. విధి ఆడిన నాటకంలో అనిల్ ప్రాణాలు కోల్పోవడంతో వీరి కుటుంబ జీవనం ఇబ్బంది కరంగా మారింది. ఉండటానికి ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటూ జీవిస్తున్నారు. విషయం తెలుసుకున్న భూపతిపూర్ గ్రామానికి చెందిన కచేరి కాడ ముచ్చట్లు అనే గ్రూప్ సభ్యులు చలించి మృతుని కుటుంబానికి 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. వీరు మాట్లాడుతూ ఇది చాలా బాధాకరం అని వాహనాలు నడిపే వారు జాగ్రత్తగా నడపాలని, హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడుపకూడదు అని అన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ యూనియన్ వారు,దాతలు ఎవరైనా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మా గ్రూప్ తరుపున ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేపడతామని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button