కథలాపూర్
విత్తనాల కొనుగోలు లో జాగ్రత్తలు పాటించాలి

viswatelangana.com
May 27th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట, దుంపేట, బొమ్మేన, కలికోట, పోసానిపేట లలో వ్యవసాయ అధికారిణి యోగితా ఆధ్వర్యంలో ఎఈవో లు రైతులకు విత్తనాలు కొనుగోలు లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గుర్తింపు ఉన్న డీలర్ల వద్ద కొని రసీదు పైన విత్తన రకం, రేటు, లాట్ నెంబర్, కంపెనీ పేరు ఉండేలా చూసుకోవాలని అన్నారు. వ్యవసాయ అధికారిణి యోగితా మరియు పోలీస్ అధికారులు కథలాపూర్ గ్రోమోర్ లో రికార్డులను పరిశీలించడం జరిగింది.



