కథలాపూర్
మర్రవ్వ దేవాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చెయ్యాలని ప్రభుత్వ విప్ కు వినతి

viswatelangana.com
May 28th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట గ్రామంలోని మర్రవ్వ దేవాలయ ప్రాంగణంలో అభివృద్ధి కొరకు వసతుల ఏర్పాటు, గ్రామంలోని సబ్ స్టేషన్ నుండి మర్రవ్వ దేవాలయం వరకు గల రోడ్డు మరమ్మత్తులు, విద్యుదీకరణ మరియు ధర్మ సత్రం ఏర్పాటు చేయాలని మంగళవారం రోజున ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ భూషణరావుపేట గ్రామ శాఖ అధ్యక్షులు తలారి మోహన్, సోషల్ మీడియా ఇంచార్జి కూన అశోక్ లు వినతిపత్రం అందజేశారు. దీనికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తలారి మోహన్, గ్రామ సోషల్ మీడియా ఇంచార్జి కూన అశోక్, తలారి అరుణ్ తదితరులు పాల్గొన్నారు



