కోరుట్ల

సంస్కరణల సృష్టికర్త రాజీవ్ గాంధీ

viswatelangana.com

August 20th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

మంగళ వారం రోజున కోరుట్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భావి భారత పూర్వ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 79 వ జయంతి కార్యక్రమం ఘనంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా… కాంగ్రెస్ పార్టీ కోరుట్ల పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ అద్యక్షులు కొంతం రాజంలు మాట్లాడుతూ… అతి పిన్న వయసులో భారత ప్రధాని పదవి చెప్పటిన మహనీయులు రాజీవ్ గాంధీ, నేడు వారు లేని లోటు దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది, వారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలు దేశాభివృద్ధిలో ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని, ఉన్నత వ్యక్తివం, ముఖ్యంగా ముందు చూపు గల దార్శణీకులు, వ్యవసాయ రంగంలో, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన నాయకులు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగంలో వారి కృషి అభినందనీయం, ఆర్దిక సంస్కరణలు చేసిన ఆర్ధిక నిపుణులు రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ తన చివరి శ్వాస వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అవిశ్రాంత ధీరుడు, నిరుపేదలకు అండగా నిలిచిన వీరుడు, భారత దేశాన్ని ప్రగతి బాటలో నడిపిన అజరమరుడు, రాజీవ్ ఆశయాలే… మాకు స్ఫూర్తి. అని కొనియాడారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button