కోరుట్ల

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో నేటి పోరాటాలు కొనసాగించాలి… సిపిఐ

viswatelangana.com

September 17th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

భూమికోసం భుక్తి కోసం ఎట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో నేటి పోరాటాలు కొనసాగాలని సిపిఐ జిల్లా నేత ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు, సీనియర్ నాయకులు మహమ్మద్ మౌలానాలు కోరారు. మంగళవారం రోజున 76వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాల సందర్భంగా సిపిఐ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అరుణ పతాకాన్ని ఎగురవేసి నాటి చరిత్రను వివరించారు. అమరులైన దొడ్డి కొమరయ్య, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్గుదుం మొహినుద్దీన్ షేక్, బందగి ధర్మ బిక్షం, సోయాబుల్లాఖాన్, అన్న బేరి ప్రభాకర్, చాకలి ఐలమ్మ, భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, మరెందరో త్యాగదనుల ఫలితంగా ఈ హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో 1948 సెప్టెంబర్ 17న విలీనం చేయబడిన ఫలితంగా ఈ పోరాటంలో 4 వేల 5 వందల మంది అమరులయ్యారని, మూడు వేల గ్రామాలు విముక్తి చెందాయని 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయబడిందని, గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వం ఈ విలీన దినోత్సవాన్ని అమరులను తలుచుకోవడానికి భయమెందుకో తెలపాలన్నారు. పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. నాటి పోరాట స్ఫూర్తితో నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. పేదల బతుకులు, కార్మికుల బతుకులు ఇంకా మారలేవని వాట్టీ చాకిరే చేస్తున్నారని, సమానత్వం చట్టాలు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, వాటి కొరకు మరో పోరాటాలు చేయుటకు ఐక్యమత్యంతో ఉద్యమించాలన్నారు. ఈ సమావేశంలో కార్మికులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button