రాయికల్
విస్డం హైస్కూల్లో వైభవంగా ముందస్తు బతుకమ్మ దసరా వేడుకలు

viswatelangana.com
September 28th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విస్డం హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ,దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డా.ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పువ్వులను కూడా పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని పండగ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. రావణాసురునిపై రాముడు విజయం సాధించినందుకు గాను కౌరవులపై పాండవులు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి జరుపుకుంటారన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా విద్యార్థుల వేషధారణలు బతుకమ్మల తయారీ, పిల్లలు పాడిన బతుకమ్మ పాటలు, వాటిపై చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. చివరగా మహిషాసుర మర్దన కార్యక్రమాన్ని చూస్తూ విద్యార్థులు అంతా కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నివేదిత రెడ్డి పోషకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.



