మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులను కొన్ని వార్డులకు కేటాయించడాన్ని తప్పు పట్టిన ఎమ్మెల్యే సంజయ్

viswatelangana.com
మున్సిపల్ సమావేశంలో ప్రవేశపెట్టిన జనరల్ పండ్ నిధులపై ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులను కాంగ్రెస్ వార్డులకు మాత్రమే కేటాయించడాన్ని తప్పు పట్టారు.. జనరల్ ఫండ్ నిధులు కోరుట్ల ప్రజల హక్కు అని వాటిని అన్ని వార్డులకు సమానంగా కేటాయించకుండా బి.ఆర్.ఎస్, బిజేపి, ఎంఐఎం కౌన్సిలర్ ల వార్డులపై వివక్షత చూపుతూ వారి వార్డులో నిధులు కేటాయించక పోవడంపై విచారాన్ని వ్యక్త పరిచారు.. అలాగే అభివృద్ధి పనుల కొరకు అన్ని వార్డులో నిధులు పెట్టడానికి మాత్రం మున్సిపల్ జనరల్ ఫండ్ లో నిధులు లేవు కానీ రాజకీయ నాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి 21 లక్షలు నిధులు ఎలా కేటాయిస్తారని, అనేది ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి పట్టణ అభివృద్ధి కొరకు మున్సిపల్ కు నిధులు కేటాయించలేదని, ఈ వర్షాకాలం వల్ల రోడ్లు పాడై తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని ఇలాంటి సమయంలో జనరల్ ఫండ్ ను వృద్దా చేయద్దని కోరారు. అదేవిధంగా అవసరమయితే రాజకీయాలకు అతీతంగా మాజీ మంత్రి కీర్తిశేషులు జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహానికి తన స్వంత నిధులు కూడా విరాళంగా అందిస్తానని, ఈ జనరల్ ఫండ్ నిధులు కోరుట్ల ప్రజల టాక్స్ ల ద్వారా వసూలు చేసిన డబ్బులు కాబట్టి ప్రజలకే ఉపయోగపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, కోరుట్ల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఏజెండాలోని 2 & 14వ అంశాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే కోరారు..



