రాయికల్

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారికి పూజలు చేసి ఆర్.యు.పి.పి.టి జిల్లా శాఖ సభ్యత్వ నమోదు

viswatelangana.com

October 25th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమం బల్వాంతాపూర్ ఉన్నత పాఠశాల నుండి ప్రారంభించినట్లు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం మల్యాల మండల సభ్యత్వ కార్యక్రమం పూర్తయ్యిందని అన్నారు. 24 సంవత్సరా సర్వీసు చేసుకున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరికి గెజిటెడ్ హోదా కల్పించాలని దీని ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదని అన్నారు. పదోన్నతులు రాకుండా మిగిలిపోయిన భాషాపండితులందరికి పదోన్నతులు కల్పించాలని అన్నారు. 1927 ఏర్పడిన రాష్ట్రంలోనే అత్యంత సీనియన్ ఉపాధ్యాయ సంఘమైన రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తుకు ప్రభుత్వ గుర్తింపు హోదా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కటుకం నరేందర్, రాష్ట్ర బాధ్యులు చంద సత్యనారాయణ, మడ్డి బాపు, రంగు రాజేశం, వినోద్, శేషగిరి, లలితామనోహర్, భానుప్రకాష్ రెడ్డి, నాగరాజు, జనార్దన చారీ, హేమలత, పద్మావతి, సరిత, గణేష్, వనజ, సుగుణకళ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button