రాయికల్
వన్యప్రాణుల సంరక్షణ పై అవగాహనా

viswatelangana.com
December 4th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండల అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి సంరక్షణ పై విస్డం హై స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను అడవిలోకి తీసుకెళ్లి జంతువులు పక్షులు పర్యావరణ రక్షణ కు దోహద పడుతున్నతీరును పారెస్ట్ రేంజ్ అధికారి టి భూమేష్ అవగాహన కల్పించారు. ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుంటే మానవ మనుగడ సాపిగా ముందుకుసాగుతుందని అటవీ రక్షణ కోసం అందరు పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జి పద్మ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్ మల్లన్న మరియు బీట్ ఆఫీసర్లు రమణారెడ్డి, సంధ్య, కవిత, రత్నాకర్, పాష తదితరులు పాల్గొన్నారు.



