కోరుట్ల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం – మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో!

viswatelangana.com
“మన బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండాలి?” అనే ప్రశ్న ప్రతి తల్లిదండ్రిని బాధించే అంశం. మంచి చదువు లేకపోతే జీవితంలో ఎంతసేపటికీ వెనుకబడి పోవాల్సిందే. అయితే, తెలంగాణ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ విద్యార్థుల కోసం గొప్ప అవకాశం ఇచ్చింది – మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇప్పుడు కోరుట్ల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కొత్త అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.ఈ స్కూల్ ఉచితంగా ఉత్తమమైన విద్య, అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది, మరియు అన్ని ఆధునిక సౌకర్యాలతో ముస్లిం మైనారిటీ విద్యార్థులను అభివృద్ధి దిశగా నడిపించేందుకు సిద్ధంగా ఉంది.స్కూల్ ప్రత్యేకతలు: పౌష్టికాహారంతో కూడిన మంచి భోజనం – ఆరోగ్యమే మహాభాగ్యం24 గంటల సీసీ కెమెరా పర్యవేక్షణ – పిల్లల భద్రతకు తొలి ప్రాధాన్యతఆటలకు పెద్ద మైదానం – ఆరోగ్యంతో పాటు క్రీడా నైపుణ్యం అభివృద్ధి నాణ్యమైన విద్యతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రత్యేక తరగతులు”ముస్లిం సమాజం ఇప్పుడు మేలుకోవాలి!”ఈ సందర్భంగా యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజాహిద్ మాట్లాడుతూ,”ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌లో మొదటి వచనం ‘ఇక్రా’ – ‘చదువు’ అనే మాటతో ప్రారంభమైంది. ఇది మనకు స్పష్టమైన సందేశం ఇస్తుంది – విద్య లేకుండా ఎదుగుదల సాధ్యం కాదు. కానీ, ఈ రోజుల్లో ముస్లిం మైనారిటీలు విద్యలో చాలా వెనుకబడి ఉన్నారు. ఎందుకు? సమాజం ఎదుగుతున్నా మన పిల్లలు వెనుకబడిపోవడం ఎంతో బాధాకరం. మైనారిటీ పిల్లల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అవకాశాన్ని ఉపేక్షించకండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం, వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు, ఈ స్కూల్‌లో చేరుస్తూ, వారికి మెరుగైన జీవితాన్ని అందించండి!” అని భావోద్వేగంగా సూచించారు.”మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం మన బాధ్యత!”మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇప్పుడే అడ్మిషన్ కొరకు సంప్రదించండి ఖాజా మొహియుద్దీన్ అడ్మిషన్ ఇంచార్జ్ 6301057527 కు సంప్రదించాలని అన్నారు.



