కొడిమ్యాల

ఎండే పంటలకి ఎత్తిపోతల పంప్ నీరు ఆదుకుంది

viswatelangana.com

February 13th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఎల్లంపల్లి నుండి నంది మేడారం నారాయణపూర్ మైసమ్మ చెరువు పోతారం చెరువు వరకు గోదావరి నీటిని బాహుబలి మోటార్ల ద్వారా ఎత్తిపోసిన నీరు చివరికి పోతారం చెరువు మత్తడి దూకి గ్రావిటీ ద్వారా గత వారం రోజులుగా కొడిమ్యాల పెద్ద వాగులపై నిర్మించిన మూడు చెక్ డ్యాములు పూర్తిగా నిండుకొని పూడూరు వాగు పై నిర్మించిన నాలుగు చెక్ డ్యాములు నిండుకుని ఎండిపోయే పంటలను రక్షించడం కొడిమ్యాల గంగాధర మండల రైతులతో తో పాటు మైసమ్మ చెరువు గ్రావిటీ కాలువ ద్వారా బోయినపల్లి వేములవాడ చందుర్తి మండలాల రైతుల పంటలను కూడా ఈ నీరు కాపాడాయని ఇంత ముందు చూపుగా ఎత్తిపోతల్ని ప్రారంభించుటకు కృషిచేసిన ఎంఎల్ఏ లకు. నీటి పారుదల శాఖ అధికారులకు.సిబ్బందికి. తోటి రైతుల తరఫున అభినందనలు తెలుపుతనట్టు మాజీ వ్యవసాయ విశ్వవిద్యాలయ సభ్యులు వెల్ముల రాంరెడ్డి తెలిపారు. ఈ నీటి ద్వారా మత్తల్లు దూకడంతో మండలాలకు కొత్త కళ వచ్చి చెక్ డ్యాముల దృశ్యాలను తిలకిస్తూ, రావేప్, విద్యార్థులు రైతులు సంతోషంలో మునిగిపోతున్నారు

Related Articles

Back to top button