రాయికల్

కష్టపడే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది

viswatelangana.com

March 3rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి గ్రామ బిఆర్ఎస్ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న రాయికల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బర్కం మల్లేష్ మరియు మండల & పట్టణ కో-ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి . వీరి ఆధ్వర్యంలో మూటపెల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ ఎన్నుకోవడం జరిగింది.గ్రామ శాఖ సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా అలుపట్ల లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా అరుగుల దామోదర్, పూదరి వేణు, ప్రధాన కార్యదర్శిగా సండ అంజయ్య, యువజన విభాగం అధ్యక్షుడిగా గుమ్మల నాగరాజు , ఉపాధ్యక్షులుగా బెక్కం రాజేష్, సురకంటి రాజేశ్వర్ రేడ్డి, ప్రధాన కార్యదర్శిగా తొగరి లక్ష్మీ నర్సయ్య ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలి ,రానున్న స్థానిక సంస్థల ఎలక్షలల్లో మన పార్టీ అభ్యర్ధుల గెలిపే లక్ష్యంగా పని చేయాలని , కష్టపడే కార్యకర్తలకు పార్టీ అండగా వుంటుందని, రానున్న భవిష్యత్ లో పార్టీ అధికారంలోకి రావడం కాయమని వారు అన్నారు. ఈ కార్యక్రమలో మండల సమన్వయ కమిటీ సభ్యులు కొల్లూరి వేణు, కంటే గంగారం, నాయకులు ప్రశాంత్ రావు,పవన్ ,ఆరె బుచ్చన్న, నాగరాజు, సురేష్, గుండ నాగరాజు, క్రిష్ణ, షకిల్, రాజేష్, అజయ్, వంశీ, రఘు , మోక్సద్, వినిత్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button