ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో రిలే నిరవధిక దీక్షలు

viswatelangana.com
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని నిరసిస్తూ ఉమ్మడి వెల్గటూర్ ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షులు చెన్న కుమార స్వామి ఆధ్వర్యంలో ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో రిలే నిరవధిక నిరసన దీక్షలు చేయడం కొనసాగుతున్నాయి వారు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలలో ఎస్సి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాత గ్రూప్1 గ్రూపు 2 గ్రూపు 3 అన్ని రకాల ఫలితాలను ఉగ్యోగాలను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్ పి ఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి మోకేనపల్లి సతీష్ మాదిగ, ముంజంపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు భూమయ్య, గోడిశేలపేట గ్రామ ప్రధానకార్యదర్శి అరికిళ్ల శంకర్, గోడిశేలా రమేష్, కాంపెల్లి వెంకటేష్, బరిగేలా సురేష్ తదితరులు పాల్గొన్నారు



