రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణబద్ధులు కావాలి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యక్రమ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి ఈ కార్యక్రమంలో కార్యకర్తలు విధిగా పాల్గొనాలని మండల కేంద్రాల నుండి గ్రామాల వరకు పాదయాత్ర చేయడానికి రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలన్నారు. త్వరలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందని, ఈ సమావేశం విజయవంతం చేసి అందులో తీసుకునే నిర్ణయాలకు అనుకూలంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వెంకటస్వామి కోరారు. అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనలో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణ బద్దులై ముందుకు సాగాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమ సన్నాహక సమావేశం కోరుట్ల నియోజకవర్గ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి అధ్యక్షతన జగిత్యాల జిల్లా కేంద్రం ఇందిరా భవన్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తొలినాళ్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని రచించారని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించకుండా పూర్తిగా దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందని, దీన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుండాలని కోరారు. ఈకార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు నాయిని సురేష్ కోరుట్ల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెరుమాళ్ళ సత్యనారాయణ, మెట్ పల్లి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, కోరుట్ల, మెట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, తీపిరెడ్డి అంజిరెడ్డి, కోరుట్ల, మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, జెట్టి లింగం, తదితరులు పాల్గొన్నారు.



