పరీక్ష ప్యాడ్స్ పంపిణి
viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంఉప్పు మడుగు గ్రామంలో గల కస్తూరిబా పాఠశాలలో పదోతరగతి విద్యార్థినిలకు ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్లు పంపిణీ చేశారు ఇట్టి సందర్భంగా ప్రజా చైతన్య వేదిక మండల అధ్యక్షులు చింతకుంట సాయికుమార్ మాట్లాడుతు పదో తరగతి విద్యార్థులకు పరీక్షల నిమిత్తం సహయార్థంగా ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాయికల్ మండల జర్నలిస్టు జేఏసీ అధ్యక్షులు వాసరి రవి మాట్లాడుతూ విద్యార్థునిలు లక్ష్యాన్ని ఎంచుకొని క్రమశిక్షణతో కూడిన విద్యను ఆర్జించి ఉన్నత శిఖరాలు అవరోధించాలని ప్రతి ఒక్కరూ ఇదే విద్యార్థి దశలో జీవితాన్ని సరైన మార్గంలో నిర్దేశించుకునే సమయం ఇదేనని జాగ్రత్తగా క్రమశిక్షణతో ప్రతి అడుగు ముందుకు వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎన్ శోభా రాణి సిబ్బంది శ్రీ నాయకులుఇమ్మడి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు



