కోరుట్ల

జై బాపు జై భీమ్ జై సంవిధాన్..

ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం...

viswatelangana.com

April 17th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణ 2, 3, 4, 16వ వార్డులలో ఆయా వార్డు ఇన్చార్జ్ ల ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ విచ్చేశారు. ఈసందర్భంగా విచ్చేసిన నాయకులు కార్యకర్తలతో గంగాధర్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంపై భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తామని మాకు సర్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్థుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించిందని ఇటీవల పరిమాణాలు రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసను మూల సూత్రాలుగా మనకు బోధించే మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకితభావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షణ కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. రాజ్యాంగాన్ని రచించింది కాంగ్రెస్ పార్టీ అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రాజ్యాంగాన్ని పరిరక్షించేది కూడా కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన, వార్డు వార్డులలో ఇంటింటికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి వార్డులో ర్యాలీ నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పన్నాల అంజిరెడ్డి, నయీమ్, సోగ్రాభి, వార్డ్ ఇంచార్జిలు బలిజ రాజారెడ్డి, పసుల క్రిష్ణ ప్రసాద్, తెడ్డు విజయ్, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, ముజబిత్, వసిద్, అన్నం అనిల్, ఎంబేరి నాగభూషణం, ఆడెపు మధు, జిందం లక్ష్మీనారాయణ, పేట భాస్కర్, నజుముద్దీన్, ఎంబేరి సత్యనారాయణ, చిటిమెల్లి రంజిత్ గుప్తా, చిట్యాల లక్ష్మీనారాయణ, మ్యాదరి లక్ష్మణ్, కట్కమ్ దివాకర్, షహీద్ మొహ్మద్ షేక్, చిట్యాల అశోక్, సయ్యద్ అజర్, యూట్యూబ్ రాజు, కండ్లె నరేష్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button