అతిగా మద్యం సేవించి భారీ వాహనాలతో పోకడలు ప్రదర్శిస్తున్న యువత

viswatelangana.com
జగిత్యాల బైపాస్ రోడ్ రాజీవ్ రహదారి లో 13 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు వయసుగల యువకులు విచ్చలవిడిగా మత్తు పానీయాలు సేవిస్తూ అనాగరికంగా ద్విచక్ర వాహనాలపై లేనిపోని పోకడలతో అతివేగంతో బైపాస్ రాజీవ్ రహదారిపై మరియు రోడ్డును ఆనుకొని ఉన్న వీధి సందులలో చక్కర్లు కొడుతూ నానా బీభత్సం సృష్టిస్తున్నారు. కనీసం రోడ్డుపై ప్రయాణించడానికి ప్రాథమిక రవాణా నియమాలు తెలుసుకోకుండానే, తల్లిదండ్రుల అతి ప్రేమతో లక్షల పోసి కొనిచ్చిన వాహనాలను పట్టుకొని వీధులలో రోడ్లపై చెక్కర్లు కొడుతూ పాదచారుల, వాహన చోదకుల ప్రాణాలను హరిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సును పొందే వయసు నిండకుండానే పెద్ద పెద్ద వాహనాలతో ప్రజల ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించినప్పటికి తల్లిదండ్రులు, వారి పిల్లల ప్రవర్తనలో మార్పు రాకపోవడం శోచనీయం. మద్యం సేవించి వాహనం నడిపితే నడిపే వ్యక్తికే కాకుండా తోటి ప్రయాణికులకు పాదచారులకు, వాహన చోదకులకు పెను ప్రమాదం లేకపోలేదు. ఈ క్రమంలో రాజీవ్ రహదారి లో గల సాయిబాబా ఆలయం ముందు రోడ్డుపై ఓ యువకుడు అతిగా మద్యం సేవించి అతివేగంతో రోడ్డుపై చెక్కర్లు కొడుతూ వాహన చోదకులను భయభ్రాంతులకు గురి చేయడం యువత చెడిపోతోంది అనడానికి ఓ నిదర్శనం. ఇకనైనా సాయంత్రం సమయంలో రాజీరహోదారిపై ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి మద్యం సేవించి వాహనాలను నడిపే యువతను, వాహన చోదకులను అరికట్టాలని జగిత్యాల ప్రజలు ట్రాఫిక్ పోలీసులను కోరుతున్నారు.



