రాయికల్
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం

viswatelangana.com
June 6th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మైతాపూర్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరడమైనది. అనంతరం బడిబాట ప్రతిజ్ఞ, ర్యాలీ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు గోపి రాజరెడ్డి తలారి రాజేష్, గన్నే రాజరెడ్డి పంచాయతీ కార్యదర్శి వేణు, కారోబరి నరేష్,ఏ ఏ పి సి చైర్మన్ శ్యామల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు కల్పన, మహేష్, రామాంజలి, జ్యోతి, అంగన్వాడి టీచర్లు మమత, పద్మలత, బంతి, శాంత, ఆశా వర్కర్లు గంగ నర్సు, శంకరమ్మ, మమత, తులసి, తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



