కొడిమ్యాల
కొడిమ్యాలలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల పండుగ

viswatelangana.com
June 8th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం. ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాలు పండగ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గ్రామంలో తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుల శివసత్తుల పూనకాల మధ్య పురవీధులగుండా ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు యువకులు చిన్నారులు పాల్గొన్నారు



