కోరుట్లలో ఓబీసీల పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ, జూన్ 14న హైదరాబాద్‌లో పుస్తక ఆవిష్కరణ

viswatelangana.com
ఓబీసీ వర్గాల సామాజిక-రాజకీయ సమస్యలను విశ్లేషించే ఓబీసీల పోరుబాట అనే పుస్తకం ఈ నెల 14వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఆవిష్కరించబడనుంది. ప్రముఖ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి మరియు హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఈ పుస్తకాన్ని మహాగాథా సంస్థ ప్రచురించింది. ఆరు రాష్ట్రాల్లో ఆరేళ్లపాటు జరిపిన లోతైన పరిశోధన ఆధారంగా రూపొందిన ఈ పుస్తకంలో ఓబీసీల చరిత్ర, రిజర్వేషన్ చట్టాలు, కోర్టుల తీర్పులు, సమకాలీన గణాంకాల విశ్లేషణ, మరియు ఓబీసీ మేనిఫెస్టో వంటి అంశాలు విపులంగా పొందుపరచబడ్డాయి. ఈ పుస్తకం రచయితల్లో ఒకరైన నరహరి గారు తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, బసంత్‌నగర్‌కు చెందినవారు. దేశానికి సేవ చేస్తున్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా మాత్రమే కాకుండా సామాజిక సేవా రంగంలో ఆలయ ఫౌండేషన్ జన అధికార వేదిక, బిఐసిసిఐ వంటి సంస్థల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా కోరుట్ల పట్టణ పద్మశాలి సంఘ భవనంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జూన్ 14న హైదరాబాద్‌లో జరిగే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి అన్ని కులాల ఓబీసీ సంఘాల నాయకులు రాజకీయ పార్టీకి అతీతంగా పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘ అధ్యక్షులు గుంటుక ప్రసాద్, టిఆర్ పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రుద్ర శ్రీనివాస్, టిఆర్ పిఎస్ నిర్మాణ కమిటీ చైర్మన్ భోగ వెంకటేశ్వర్లు జగిత్యాల, సాంబార్ ప్రభాకర్ మెట్పల్లి , టిఆర్ పిఎస్ కార్యదర్శి జిల్లా ధనుంజయ్, కటుకం గణేష్ సిటీ కేబుల్, మిట్టపల్లి రమణ, బాలే అజయ్, గూడూరి హన్మండ్లు, ఆడెపు రమణ, భీమనాతి సత్యనారాయణ మెట్పల్లి, సంఘ ఉపాధ్యక్షులు కటుకం వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, కోశాధికారి అందె రాజ్ కుమార్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ అధ్యక్షులు ముల్క ప్రసాద్, సంఘ కార్యవర్గ సభ్యులు ఎక్కలదేవి రామచందర్, పడాల గణేష్, యువత ఉపాధ్యక్షులు బండి సురేష్, ఆడెపు నరేష్, కస్తూరి జ్ఞానేశ్వర్,వయోవృద్ధుల సంఘం నాయకులు ఎక్కల్ దేవి గంగాధర్, సిరిపురం గంగాధర్, గాజేంగి లక్ష్మీపతి, మాసం శంకర్, సంఘ దైవశెట్టిలు అల్లే లక్ష్మీనారాయణ, వంగరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.



