కోరుట్ల

ప్రభుత్వ పాఠశాలలో ఏక రూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు నోట్ బుక్కుల పంపిణి

viswatelangana.com

June 12th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సమదుస్తులు, పాఠ్యపుస్తకాలు అలాగే నోట్ బుక్కుల పంపిణీకి మండల విద్యాధికారి గంగుల నరేశంతో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గుగ్గిళ్ల సురేష్ గౌడ్ ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ఉచితంగా ఏక రూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు అలాగే నోట్ బుక్కుల ను అందజేయడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐకెపి ఎపిఎం శంకర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పృధ్విధర్, పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్, చాంద్ ఖాన్, జనార్ధన్, శైలజ, మాధవి, రజని రాజగోపాల్, మహిళా సంఘ ప్రతినిధులు మాధురి, విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు పాల్గొన్నారు

Related Articles

Back to top button