రాయికల్

ఘనంగా స్ట్రీట్ వెండర్ ఫుడ్ ఫెస్టివల్

viswatelangana.com

June 21st, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మార్కెట్ ప్రాంగణంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అమృత్ 2.0 వందరోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం స్ట్రీట్ వెండర్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వివిధ పిండి వంటకాలను ప్రదర్శించారు. కొంతమంది ఆ పిండి వంటకాలను కొన్నారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాసనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మెప్మా టిఎంసి శరణ్య, మెప్మా ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button