కోరుట్ల

కోరుట్ల కోర్ట్ సూపరింటెండెంట్ మంజుల‌కు ఘనసన్మానం

viswatelangana.com

June 30th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల కోర్టులో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తూ తన కర్తవ్యనిష్ఠతో విశిష్ట సేవలందించిన మంజుల సాధారణ బదిలీ ద్వారా జగిత్యాల II ADJ కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కోరుట్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆమెకు ఘన సన్మానం అందజేశారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బైరి విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కొంపల్లి సురేష్, ఖజానాదారు చింతకింది ప్రేమ్, క్రీడల కార్యదర్శి సుతారి నవీన్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చాప వందన, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాసాభక్తుల రాజ శేఖర్, బద్ది నర్షయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ కోరుట్ల కోర్టులో పనిచేసిన రోజులు తనకు మరపురాని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని, బార్ సభ్యుల నుండి పొందిన ఆదరణ ఎన్నటికీ మరిచిపోలేనిదని తెలిపారు. నూతన పోస్టింగ్‌లో కూడా అదే విధంగా ప్రజలకు న్యాయం అందించే పనిలో నిబద్ధతతో పనిచేస్తానని అన్నారు. కార్యక్రమం చివరగా బార్ సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ జ్ఞాపికను అందజేశారు.

Related Articles

Back to top button