కోరుట్ల

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జువ్వాడి నర్సింగరావు జన్మదిన వేడుకలు

viswatelangana.com

July 4th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు జన్మదిన సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని ఏసుకొని గుట్ట లో గల ప్రభుత్వ పాథమిక పాఠశాలలోనీ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి , పాఠశాలలో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు… ఈ సందర్భంగా కోరుట్ల పట్టణ మరియు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రాల హరీష్ మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నర్సింగరావు నిండు నూరేళ్ళు ఆరోగ్యం, ఆనందం, ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని, వారు చేసే సేవా పయనం మరింత ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతూ, అత్యున్నత హోదా పొందాలని అన్నారు… ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ, మండల యూత్ ఉపాధ్యక్షులు ముక్కెర రాజేష్, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నాగరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు అక్షయ్, ఉపాధ్యాయుల విద్యార్థులు పాల్గొన్నారు

Related Articles

Back to top button