సామాన్యుని చేతిలో ఆర్టిఐ వజ్రాయుధము

viswatelangana.com
సామన్యూని చేతిలో ఆర్టిఐ సమాచార హక్కు చట్టం వజ్రాయుధమని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర మరియు మానవ హక్కుల సంస్థ కథలాపూర్ మండల ఇన్చార్జ్ చెట్లపల్లి మహేష్ మాట్లాడుతూ ఏదైనా సమాచారం కావాలంటే అధికారులకు లంచాలు ఇవ్వద్దని, ఆర్టిఐ ని ఉపయోగించుకోవాలని, అలాగే సమాజంలో పేరుకుపోయిన అవినీతి బయటకు తీస్తామని అవినీతి రహిత అలసత్వం లేని సమాజం నిర్మించడమే సిసిఆర్ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. అలాగే ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద అవినీతి నిరోధక శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మహేష్ కోరారు అవినీతికి తావు లేకుండా ప్రజలకు నిస్వార్ధంగా సేవలు పొందేలా చూడాలని అవినీతి చేస్తూ పట్టుబడిన అధికారులను కఠినంగా శిక్షించి వారిని పూర్తిగా ఉద్యోగం నుండి తొలగించి పింఛన్ రాకుండా మరియు ప్రభుత్వం నుండి యేఇతర లాభాదాయకమైన పథకాలు వర్తించకుండా చేసే చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించబోతున్నట్లు తెలిపారు. ప్రజలందరూ సమాచార హక్కు చట్టంపై( 2005) అవగాహన పెంచుకోవాలని వివరించారు.



