భీమారం
పద్మపాణి సొసైటీ, కరీంనగర్ వారి అద్వర్యంలో హెల్త్ క్యాంప్
viswatelangana.com
February 28th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా, భీమారం మండలం, వెంకట్రావుపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు పద్మపాణి సూపర్ వైజర్ నక్క సుదర్శన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని 50 మంది ప్రజలకు రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ చంద్ర, సూపర్ వైజార్ పద్మాలత, సిహెచ్ఓ దేవన్న, ఏఎన్ఎం సబిత, సరస్వతి, ఆశ వర్కర్స్- గీత రాణి, రాధ, లింక్ వర్కర్స్- స్రవంతి, పద్మ, సుజాత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



