కరీంనగర్
పద్మశాలి ఉద్యోగ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
viswatelangana.com
January 19th, 2024
కరీంనగర్ (విశ్వతెలంగాణ) :
తెలంగాణా పద్మశాలి ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా 2024 క్యాలెండర్ ను ఎక్సైజ్ సూపరిండెంట్ సామల పంచాక్షరి ఆవిష్కరించారు. ఉద్యోగుల భవిష్య నిధి ఎన్ఫోర్స్మెంట్ అధికారి మరియు కరీంనగర్ జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం అసోసియేట్ అధ్యక్షులు ఆ డే పు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణా లో పద్మశాలి ఉద్యోగులు చాలా మంది ఉన్నారని , అందరూ ఐక్యంగా ఉండి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగయ్య, డీ ఆర్ డి ఓ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి భాస్కర్, జౌళి శాఖ ఏ. డీ సాగర్, ఎల్లారెడ్డి పెట్ మండల అభివృధి అధికారి చిరంజీవి, చందుర్తి తహశీల్దార్ శ్రీనివాస్, కోశాధికారి శ్రీనివాస్, రవి, అమిత, నవీన్, సాయికృష్ణ, అడిషనల్ కలెక్టర్ సి సి వెంకట రమణ, డీ టీ అరవింద్, ఏ పి ఓ అరుణ,సబిత పాల్గొన్నారు.



