కోరుట్ల
కోరుట్ల సీఐ సురేష్ బాబు ను సన్మానం చేసిన పాత్రికేయులు

viswatelangana.com
March 6th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలో మైనారిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కోరుట్ల పట్టణానికి నూతనంగా వచ్చిన సీఐ సురేష్ బాబును మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్ష ణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మైనారిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మిర్జా ముఖ్రం బేగ్, ఉపాధ్యాయుడు ఖలీల్, రఫీ, సుజయత్ అలీ, అజహర్, వాజిద్ బాయి, బషీర్, సులేమాన్ ,రాషద్ హుస్సేన్, పాల్గొన్నారు.



