సరస్వతి ధాన్య పీఠంలోనోట్ పుస్తకాలు. పెన్నులు పంపిణీ

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల చదువులమ్మ ఒడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొడిమ్యాల శ్రీసరస్వతీ ధ్యాన పీఠంలో శ్రీ పంచమినిపురస్కరించుకొని సోమవారం ఉదయం ఘనంగా వసంత పంచమి వేడుకలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ. 1983-84 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.భూమేశ్వర్, బి.రవినందన్రావు, ఉపాధ్యక్షురాలు సి.హెచ్వెంకటలక్ష్మి, కార్యవర్గసభ్యులు జి.నర్సయ్య, జి.విజేందర్రావు, కె.సుజాత, డి.శంకర్కె.గంగరాజం, బి.శ్రీనివాస్, ఎ.లక్ష్మీరాజం, ఎ.శ్రీనివాస్, సి.హెచ్దేవయ్య, ఎన్.మల్లేశం, ఆదిరెడ్డి, ఎన్.రామయ్య తదితరులు పాల్గొన్నారు. బాల్య మిత్రులు సి.హెచ్మహేందర్ రావు సౌజన్యంతో అంతకుముందు పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అలాగే చిన్నారులకు అక్షర అభ్యాస కార్యక్రమం నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా శ్రీ సరస్వతీ ధ్యాన పీఠంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.రవినందన్ రావు ఈ సందర్బంగా తెలిపారు.



