రాయికల్
పదవ తరగతి టాపర్ లను సన్మాణించిన బీజేపీ నాయకులు

viswatelangana.com
May 3rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో చదివి పదవ తరగతిలో ఉత్తమ మార్కులు పొంది ప్రథమ స్థానం సాధించిన ఎనుగంటి ప్రసన్న లక్ష్మి, ద్వితీయ స్థానం సాధించిన కట్కం అక్షయ లను బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ మార్కులు సాధించి, గ్రామానికి మంచి పేరు తెచ్చిన విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్ మాజీ ఉపసర్పంచ్ ఆర్మూరు నరేందర్, నాయకులు కోల శంకర్, బోయిని నరేందర్, ఎనుగంటి నాగరాజు, వట్టిమల్ల శ్రీనివాస్, బంటి, కటకం రమేష్ తదితరులు పాల్గొన్నారు.



