కథలాపూర్
సిరికొండ లో సామూహిక కుంకుమార్చన పూజ

viswatelangana.com
October 5th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో శనివారం రోజున పురోహితులు నారంభట్ల నరేష్శర్మ ఆధ్వర్యంలో దుర్గామాత సన్నిధిలో భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉపవాస దీక్షతో ఉండి కుంకుమార్చనను విజయవంతం చేశారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ పూజలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని మహిళలు తెలిపారు. దుర్గా మండపంలో ఉచితంగా భగవద్గీత పుస్తకాలు సిరికొండ సింగిల్ విండో చైర్మన్ కందరి జీవన్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో దుర్గామాత ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు, భవానీ దీక్ష మాలదారులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు



