కథలాపూర్
ఎరువుల దుకాణం సీజ్ చేసిన వ్యవసాయ అధికారిణి
viswatelangana.com
February 25th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలంలోని గంభీర్ పూర్ గ్రామంలో ఆదివారం మండల వ్యవసాయ అధికారిణి కే. యోగిత మహేంద్ర సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ ఎరువుల దుకాణం సీజ్ చేశారు. ఈ దుకాణం లైసెన్స్ గడువు తేదీ దాటడంతోపాటుబిల్ బుక్ లు, రిజిస్టర్లు సరిగా లేని కారణంగా మూడు లైసెన్స్ లను రద్దు చేశామని తెలిపారు. మండలంలో లైసెన్స్ ఉన్న అన్ని డీలర్ షిప్ దుకాణాల యజమానులు ఇటువంటి అనుమతి లేని దుకాణాలకు ఎరువులు సప్లై చేయకూడదని వివరించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో ఖచ్చితంగా వారి నుండి రశీదు తీసు కోవాలని.. అలాగే లైసెన్స్ లు లేని దుకాణాల్లో కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దని తెలిపారు.



