హిందూ సేన యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 16 వ వార్డు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలనీలో హిందూ సేన యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద శుక్రవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాశ్వత అన్నదాత బలిజ రాజారెడ్డి పద్మ లు వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమానికి కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, పట్టణ మహిళా అధ్యక్షురాలు మచ్చ కవిత, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్ కుమార్ ,కోరుట్ల సింగిల్ విండో చైర్మన్ ఎలిసెట్టి భూమిరెడ్డి, 3వ వార్డు కౌన్సిలర్ మోర్తాడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి మేకల నరసయ్య, సహాయ కార్యదర్శి ఎంభేరి సత్య నారాయణ లు వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాల యువజన సంఘం అధ్యక్షుడు కంబ ఆనంద్, ఉపాధ్యక్షుడు మేకల మహేష్, కోశాధికారి ధామ రాజేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ రాష్ట్ర నాయకులు ఉయ్యాల నరసయ్య, డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్, సంఘ నాయకులు పసుల కృష్ణ ప్రసాద్, మగ్గిడి వెంకటి, సామల గంగా నరసయ్య, గురు మంతుల సత్తయ్య, అరిసె గంగా నరసయ్య, పోట దేవదాస్, అరిసె శంకర్, హిందూ సేన యూత్ సభ్యులు, పలువురు పాత్రికేయులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.



