రాయికల్
పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

viswatelangana.com
March 16th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగాఏర్పాటుచేసిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం పొట్టి శ్రీరాములు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గంప ఆనందం, ప్రధాన కార్యదర్శి పిప్పరి గంగాధర్, కోశాధికారి చింత అశోక్, పట్టణ అధ్యక్షులు కూరగాయల రవి, రాష్ట్ర నాయకులు ఎలుగందుల సత్యనారాయణ, పట్టణ నాయకులు గరిపెల్లి శ్రీనివాస్, పవన్, చింత శివకుమార్, లింగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



