అక్రమ పిరమిడ్ కట్టడాన్ని కూల్చివేయాలని వినతి

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మహితాపూర్ గ్రామ శివారులో వ్యవసాయ భూమిలో నిర్మిస్తున్న అక్రమ పిరమిడ్ కట్టడాన్ని కూల్చివేయాలని,గ్రామ శివారులో ఓ గుడిసె లో చేస్తున్న అన్యమత ప్రచారాన్ని నిలిపివేయాలని కోరుతూ హిందూ చైతన్య వేదిక, ఆలయాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పంచాయతీ కార్యదర్శి వేణుకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిరమిడ్ ముసుగులో హిందూ సాంప్రదాయాలు,ఆచార వ్యవహారాలకు భిన్నంగా అన్యమత ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా విగ్రహారాధన చేయకూడదని, కుటుంబంలో ఎవరైనా వ్యక్తులు మరణిస్తే పితృ కర్మలు సైతం మానివేయాలని, అన్యమతస్తులు మత మార్పిడిలు ప్రోత్సహించడం వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక,ఆలయాల పరిరక్షణ కమిటీ సభ్యులు క్యాషనూరి మఠం జగదీశ్వర్,బూస గంగ మల్లయ్య, సద్ది మహిపాల్,బేతి సత్యనారాయణ, దేశ వేని శ్రీనివాస్, శివనీతి కిష్టయ్య, పాలడుగు లింగారెడ్డి, రామన్న, కొల్ల కృష్ణారెడ్డి, వట్టిమల్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



