రాయికల్

ఆత్మీయ సమ్మేళనం ఓ మధురానుభూతి

viswatelangana.com

May 22nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ మండలంలోని వీరాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1984-86 విద్యా సంవత్సరంలో 4వ తరగతి విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు బుధవారం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకరినొకరు అలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేచుకున్నారు. బాల్యంలో విద్యాబుద్ధులు నేర్పిన తొలి గురువు ప్రభుత్వ ఉపాధ్యాయులు నందెల్లి మదన్మోహన్ రావు దంపతులను పూజించి శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపకను అందజేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. పూర్వ విద్యార్థులు ఒకే చోట చేరడంతో పాఠశాల ఆవరణమంతా సందడి నెలకొంది. ఇకనుంచి అందరం కలిసి మెలిసి ఉండాలంటూ ఒకరినొకరు ఫోన్ నెంబర్లు మార్చుకోవడంతోపాటు వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని ఈ మధుర జ్ఞాపకాలను తమ తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. అనంతరం అందరు కలిసి సహపంక్తి భోజనం చేసి తదుపరి ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సవంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దుంపల స్వామిరెడ్డి, సోమ నర్సారెడ్డి, సుంకెసాని శోభరాణి, నీలి మహేందర్, నీలి నారాయణ, సర్దార్, సోమ నరేందర్, కనికరపు స్వామి, మోతె రాజం, శ్రీరాముల రవీందర్, చెదల శంకర్, నీలి మహిపాల్, షేక్ ఇబ్రహీం, ఎర్రోళ్ల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button