
viswatelangana.com
July 2nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల ఆవరణలోని ఒకవైపు నీరు నిండి ఉన్నది నీరు నిలవడం వల్ల దోమల ఉధృతి ఎక్కువై విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని తెలుసుకున్న ప్రభంజన యూత్ సభ్యులు మరియు పూర్వ విద్యార్థులు ఇప్పుడు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తమ వంతు విరాళం 5000 రూపాయలను ప్రధానోపాధ్యాయులు కు అందజేశారు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల కు సహాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షపు నీరు వెళ్లే విధంగా చర్యలు చేపట్టి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. విరాళం దాతలను పలువురు నాయకులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు



